శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మా సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పిన వి.వి. వినాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో మరో మాటే లేదు. శ్రీకాంత్ గారితో సినిమా చేయడం నాకు ఎప్పుడూ హాయిగా ఉంటుంది. ఈ సినిమాను కూడా ఎంతో ప్రశాంతంగా పూర్తి చేశాం. పెళ్లి సందడి, వినోదం, ఎగిరే పావురమా, ఆమే వంటి శ్రీకాంత్ గారి బ్లాక్‌బస్టర్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు రావాలి. శ్రీకాంత్ గారు మరో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నారు. వెయ్యి శాతం గ్యారెంటీగా చెబుతున్నాను. శ్రీకాంత్ గారి కోసమైనా ఈ సినిమాను చూడాలి. రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తారు. ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ సినిమాకు ఆయన వెన్నెముకలా నిలిచారు. కుటుంబంలో ఉన్న ప్రతి భార్య లయ గారి పాత్రను ఎంతో ఇష్టపడుతుంది.
ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. మా డీవోపీ అంజి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి నాకు అండగా నిలిచారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా ఆయన రీ-రికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసింది. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో మాషప్ చేసి రూపొందించిన ఒక ప్రత్యేకమైన పాట ఉంది. అది విన్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. మా నిర్మాత చందు గారు చాలా ప్రశాంత స్వభావం ఉన్న వ్యక్తి. ఆయనకు ఎప్పుడూ కోపం రావడం నేను చూడలేదు. అలాగే జీకే గారు కూడా ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా ద్వారా నిర్మాతలు తప్పకుండా సూపర్ హిట్ అందుకుంటారు. జూలై 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ఘన విజయం సాధిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను.”
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























