తుంబాడ్ 2 లోకి అలియా భట్.. రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్

Tumbbad 2 Gets Alia Bhatt and an Official Release Date

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ పీరియాడిక్ ఫోక్లోర్ హారర్ చిత్రంగా కల్ట్ క్లాసిక్ హోదా తెచ్చుకున్న ‘తుంబాడ్’ సీక్వెల్‌కు సంబంధించిన ఒక సెన్సేషనల్ కాస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ అలియా భట్ అధికారికంగా ‘తుంబాడ్ 2’ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టింది. హీరో కమ్ ప్రొడ్యూసర్ సోహమ్ షా మరియు పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా అలియా భట్‌ను ‘తుంబాడ్’ లీనమయ్యే చీకటి ప్రపంచంలోకి ఘనంగా ఆహ్వానించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వైవిధ్యమైన ఫోక్లోర్ డ్రామాను సోహమ్ షా ఫిల్మ్స్ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి సహ-దర్శకత్వం, రచన అందించిన ఆదేశ్ ప్రసాద్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రంలో సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో పాటు అలియా భట్ ఒక పవర్ ఫుల్ మరియు కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. తన కెరీర్‌లోనే అలియా భట్ నటిస్తున్న మొదటి పూర్తి స్థాయి హారర్ జోనర్ చిత్రం ఇదే కావడం గమనార్హం.

మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా, మరింత భారీ కాన్వాస్‌పై, ఊహించని మైండ్ బెండింగ్ ట్విస్టులతో ఈ కథ సాగనుంది. అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ, ఈ ‘తుంబాడ్ 2’ చిత్రాన్ని డిసెంబర్ 3, 2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.