హిలేరియస్‌గా కొరియన్ కనకరాజు టీజర్

Korean Kanakaraju teaser out now

వరుణ్ తేజ్ హీరోగా కొరియన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ‘కొరియన్ కనకరాజు’.పక్కా లోకల్ పల్లెటూరైన “పెనుగొండ” నేపథ్యానికి, ఇంటర్నేషనల్ “కొరియన్” కల్చర్‌ను ముడిపెడుతూ డైరెక్టర్ మేర్లపాక గాంధీ మార్క్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈసినిమా టీజర్‌ విడుదలయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ చూస్తుంటే ఈ క్రాస్‌ఓవర్ కంటెంట్ థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కట్టిపడేయబోతోంది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేయని సరికొత్త మాస్ కమ్ కామెడీ అవతారంలో తన మార్క్ బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టనున్నాడు. కొరియన్ యాక్షన్ డ్రామా స్టైల్ ఫైట్స్‌కు, గోదావరి పల్లెటూరి యాసను, కామెడీ టైమింగ్‌ను మిక్స్ చేసిన విధానం టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. సత్య కామెడీ కూడా టీజర్ లో మెయిన్ హైలైట్ అయ్యింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్ రేంజ్‌ను మార్చేసింది.

ఇందులో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈసినిమాతో వరుణ్ తేజ్ కం బ్యాక్ ఇవ్వనున్నాడని తాజాగా విడుదలైన టీజర్ స్పష్టం చేసింది. ఆగస్టు 7న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.