శ్రీనివాస మంగాపురంతో  పరిచయం కావడం నా అదృష్టం –  రాషా తడానీ  

Rasha Thadani Calls Her Srinivasa Mangapuram Debut a Blessing

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్  పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాషా తడాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘శ్రీనివాస మంగాపురం’ కథను ఎప్పుడు విన్నారు?
-గత ఏడాది జూలైలో ఈ కథ విన్నాను. దర్శకుడు అజయ్ భూపతి గారు కథ చెప్పిన విధానం, పాత్రలను, అందులోని ప్రేమ, ఎమోషన్‌ను తీర్చిదిద్దిన తీరు నాకు ఎంతగానో నచ్చాయి. కథ వింటున్నప్పుడు ఆయన ప్రతి పాత్రను ఎంతగా ప్రేమించారో నాకు అర్థమైంది. ఆ ఎమోషన్‌ను నేను కూడా ఫీల్ అయ్యాను. ఇది చాలా అద్భుతమైన కథ.

మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది?
-నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకవైపు చాలా బబ్లీగా, ఎక్సైటెడ్‌గా ఉంటుంది. మరోవైపు చాలా పద్ధతిగా, హుందాగా ఉండే అమ్మాయిగా కనిపిస్తుంది. అలా ఉంటుందో థియేటర్‌లో సినిమా చూస్తే తెలుస్తుంది. నా పాత్రకు రెండు విభిన్న కోణాలు ఉన్నాయి.

-నాకు తెలుగు అర్థమవుతుంది. కానీ స్పష్టంగా మాట్లాడలేను. ఈ సినిమా కోసం దర్శకుడు అజయ్ భూపతి గారు ప్రతి డైలాగ్, అందులోని ఎమోషన్‌ను దగ్గరుండి నేర్పించారు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. మంగా పాత్ర నాకు చాలా దగ్గరగా ఉంటుంది.

జయకృష్ణ ఘట్టమనేనితో పని చేయడం ఎలా అనిపించింది?
-జయకృష్ణ చాలా స్వీట్ అండ్ కూల్ పర్సన్. సెట్లో చాలా సరదాగా వుంటారు. షూటింగ్ సమయంలో చాలా ఫన్ ఉండేది.  

మోహన్ బాబు గారితో పని చేయడం ఎలా అనిపించింది?
-మా అమ్మగారు కూడా మోహన్ బాబు గారితో కలిసి పని చేశారు. ఆయనతో పని చేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియెన్స్. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ జోకులు చెబుతూ ఉంటారు. ఆయన అనుభవం మాకు ఎంతో ఉపయోగపడింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

ఇది తెలుగులో మీ మొదటి సినిమా. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
-నాకు తెలుగు తెలియదు. మొదట్లో డైలాగులు అర్థం చేసుకోవడానికి కాస్త కష్టపడ్డాను. కానీ దర్శకుడు అజయ్ భూపతి గారు నాకు చాలా హెల్ప్ చేశారు. తెలుగు, హిందీ కలిపి డైలాగుల అర్థం చెప్పేవారు. ఆయన వల్ల నా పని చాలా ఈజీ అయింది. పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాతే షూటింగ్ చేసేవాళ్లం. కావాల్సిన టైమ్ ఇచ్చేవారు.

వైజయంతి మూవీస్ ద్వారా తెలుగులో రావడం ఎలా అనిపించింది?
-వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థ నుంచి మహేష్ బాబు గారితో పాటు ఎంతో మంది స్టార్స్ పరిచయం అయ్యారు. నా జీవితంలో కలిసిన బెస్ట్ పర్సన్‌లలో అశ్విని దత్ గారు ఒకరు. ఆయన నన్ను ఎప్పుడూ మనవరాలిలా చూసుకునేవారు. ఏది కావాలన్నా అడగమని చెప్పేవారు. మా తాతగారితో కూడా ఆయనకు మంచి పరిచయం ఉంది. వాళ్లు ముంబైలో కలిసేవారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు చూసినప్పటికీ ఆయన ఎంతో వినయంగా, డౌన్ టు ఎర్త్‌ ఉంటారు.

తెలుగులోకి రావాలనే ఆలోచన మీదేనా? లేక ఇంట్లో చెప్పారా?
-నేను టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా చెప్పాను. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. బాహుబలి నాకు ఎంతో నచ్చిన సినిమా. తెలుగు సినిమా చాలా అడ్వాన్స్‌గా ఉంది. ప్రతి సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఇలాంటి పరిశ్రమలో తప్పకుండా పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.  

తెలుగు సినిమా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు ఏమన్నారు?
-తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్ కూడా చాలా ఫన్‌గా ఉంటుందని చెప్పారు. అలాగే తెలుగు భాష నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఆమె చెప్పినట్టుగానే తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

ఈ సినిమాలో ఏయే అంశాలు ఉంటాయి?
-ఇందులో యాక్షన్, లవ్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది.

మీ నాన్నగారి స్పందన?
-నేను తెలుగు సినిమా చేయడం మా నాన్నగారికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వాలని కూడా అనుకున్నారు. నేను తెలుగులో నటించడం ఆయనకు చాలా సంతోషంగా అనిపించింది.

-శ్రీనివాస మంగాపురం లాంటి మంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అజయ్ భూపతి గారికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇందులో కూడా నా పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేశాను.

మీకు ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని ఉంది?
-నాకు అన్ని జోనర్ సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం నా నెక్స్ట్ సినిమా కామెడీ జోనర్‌లో ఉంది. యాక్షన్, కామెడీ, పీరియడ్… ఇలా అన్ని రకాల సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.

ఈ సినిమాలో పాటల గురించి?
-ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. ఆరు పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. నాకు ఈ సినిమాలోని అన్ని పాటలూ ఫేవరెట్. జీవీ ప్రకాష్ గారి సంగీతం నిజంగా మ్యాజిక్‌లా ఉంటుంది. ఆయన సంగీతం అందించిన సినిమాలో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

అజయ్ భూపతి సినిమాల గురించి?
-అజయ్ భూపతి గారి ఆర్ఎక్స్ 100 చూసినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అలాగే మంగళవారం కూడా చాలా ప్రత్యేకమైన సినిమా. శ్రీనివాస మంగాపురం కూడా అద్భుతంగా వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ అనుభవం ఎలా ఉంది?
-ఈ సినిమా చేయడం నాకు నిజంగా ఒక వెకేషన్‌లా అనిపించింది. షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను.

తిరుపతిలో షూటింగ్ గురించి?
-నా తొలి తెలుగు సినిమా షూటింగ్ తిరుపతిలో జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. దేవుడు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.