ఆసక్తికరంగా హృదయం మురళి ట్రైలర్

Hrudayam Murali’ Trailer Looks Intriguing

కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి ప్రధాన పాత్రలో, మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ఇదయం మురళి. తెలుగులో ఈసినిమా హృదయం మురళిగా రిలీజ్ అవుతుంది. ప్రముఖ నిర్మాత ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అఫీషియల్ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక యువకుడి జీవితంలో ఎదురయ్యే వన్-సైడెడ్ లవ్ దాని చుట్టూ సాగే బలమైన భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. జీవితంలో ఎంత ముందుకు సాగినా కొన్ని జ్ఞాపకాలు, అనుభూతులు ఎప్పటికీ హృదయం నుండి చెరిగిపోవనే పాయింట్‌ను హృదయానికి హత్తుకునేలా ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ కథానాయికలుగా నటించారు.

ఈ సినిమాకు మరో అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ నటుడిగా వెండితెరపై మెరవబోతున్నారు. నటనతో పాటు ఈ చిత్రానికి ఆయనే అద్భుతమైన సంగీతాన్ని అందించడం విశేషం. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో అందిస్తోంది. విజువల్స్, ఎమోషన్స్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.