అల్లరి నరేష్ తన వింటేజ్ కామెడీ జోనర్లోకి రీ-ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న లేటెస్ట్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ నరేష్ 65 టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసేశారు.ఈసినిమాకు ‘రంభ ఊర్వశి మేనక’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ , హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఒక వైవిధ్యమైన వినోదాత్మక సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. నరేష్ మార్క్ టైమింగ్, సరికొత్త ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
బర్త్‌డే గిఫ్ట్‌గా కేవలం టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా ఏకంగా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించి మేకర్స్ డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఈసినిమాను సెప్టెంబర్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ పూర్తి స్థాయి కామెడీ, ఫాంటసీ సబ్జెక్ట్‌తో వస్తుండటంతో థియేటర్లలో నవ్వుల జాతర ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























