గుర్తుకొస్తున్నాయి కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది –  హీరో సత్యదేవ్  

Satyadev Praises the Intriguing Content of Gurthukostunnayi

యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరిస్ ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గ్లింప్స్, సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో హీరో సత్యదేవ్, దర్శకులు బోయపాటి శ్రీను, కరుణా కరణ్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్కేఎన్, ధీరజ్, వంశీనందిపాటి అతిధులుగా పాల్గొన్నారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు భాగ్యరాజ్ గారి మరణ వార్త చాలా బాధాకరం. ముందుగా ఆయనను స్మరించుకుంటూ మౌనం పాటిద్దాం. మన ఇండస్ట్రీలో నేను పని చేసిన గొప్ప సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. ‘సరైనోడు’ సినిమా సమయంలో బన్నీ బాబుతో చేసిన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ప్రయాణంలో ఎంతోమంది పరిచయమయ్యారు. ఈరోజు వారందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అందులో శరత్ కూడా ఒకరు. శరత్ ఒక మంచి కథను వెబ్ సిరీస్‌గా రూపొందించి, దాన్ని రిలీజ్ చేయడానికి ఈటీవీ విన్‌ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. తనకు ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ రావడమే ఒక విజయం. గీతా ఆర్ట్స్, ఈటీవీ విన్ రెండూ కూడా అత్యుత్తమ కంటెంట్‌ను అందించే సంస్థలు. అలాంటి సంస్థల్లో ఈ సిరీస్ విడుదల కావడం గొప్ప విషయం. ఈ విజయం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ ఈజ్ ది కింగ్. ఇటీవల వచ్చిన సింగీతం, బ్లాస్ట్, మా ఇంటి బంగారం వంటి చిత్రాలు అద్భుతంగా విజయం సాధించాయి. అదే వరుసలో ‘గుర్తుకొస్తున్నాయి’ కూడా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సిరీస్‌కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ నుంచి ధీరజ్ గారు, ఎస్‌కేఎన్ గారు, శరత్ గారు, బన్నీ వాసు గారు… ఇలా ఎంతోమంది నిర్మాతలుగా రావడం, అందరూ సక్సెస్‌ఫుల్‌గా మంచి సినిమాలు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. శరత్ మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఈటీవీ విన్ అద్భుతమైన కంటెంట్‌ను అందిస్తోంది. విరాజ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. నేను, బన్నీ వాసు గారు ఒకే కమ్యూనిటీలో ఉంటాం. మొన్న ఒకసారి లిఫ్ట్‌లో బన్నీ వాసు గారు కలిశారు. ‘బన్నీ గారిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను’ అని చెప్పారు. నన్ను కూడా రమ్మన్నారు. అక్కడ వారందరినీ కలిసి చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఫ్రెండ్స్ అందరూ ఇలా ఒక చోట కలిసి ఉండటం చాలా మంచి విషయం. ‘గుర్తుకొస్తున్నాయి’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజుల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు అని వేర్వేరుగా లేవు. ఆ రెండింటి మధ్య ఉన్న గీత చెరిగిపోయింది. మంచి కంటెంట్ ఎక్కడ ఉన్నా ప్రేక్షకులు పూర్తిగా ఆదరిస్తారు. ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.