ఆసక్తిరేపుతున్న ఇడుపు కాయితం

Idupu Kaayitham’ Raises Intrigue Among Audiences

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి హీరోగా , తెలంగాణ జానపద గీతాల ద్వారా విశేష ప్రజాదరణ పొందిన నాట్య కళాకారిణి, ఫోక్ సెన్సేషన్ నాగాదుర్గ కథానాయికగా పరిచయమవుతున్న సరికొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం నాడు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ వాడుక భాషలో ‘ఇడుపు కాయితం’ అంటే ‘విడాకులు’ అని అర్థం. వరంగల్‌లోని ఒక పల్లెటూరి మనుషుల కథగా, తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ వేడుకకు టాలీవుడ్ మరియు కోలీవుడ్ నుండి దిగ్గజాలు హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు.చిత్ర స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, నవీన్ యెర్నేని కలిసి దర్శకుడు వంశీరెడ్డి, నిర్మాత బన్నీ వాస్‌లకు అందజేశారు.ముహూర్తపు షాట్‌కు ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ కొట్టగా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేసి మొదటి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఆయన చేతుల మీదుగానే ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్ మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చందూ మొండేటి, కార్తీక్ దండు, మెహర్ రమేష్, ప్రొడ్యూసర్ దామోదర్ రెడ్డి లాంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాంప్రదాయ కట్టుబొట్టుతో ఉన్న ఒక పల్లెటూరి యువతి తన భర్తను హత్తుకుని నగరానికి వలస వెళ్తున్నట్లుగా ఎంతో సహజంగా ఉన్న ఫస్ట్‌లుక్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం వచ్చే నెల (జూలై) నుండి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకుని, నవంబర్‌లో విడుదలకు సిద్ధం కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.