మా ఒక్కడు  రీ రిలీజ్ కావడం  నాకు చాలా సంతోషంగా ఉంది –  ఎంఎస్ రాజు

M. S. Raju Expresses Happiness Over the Re-Release of Okkadu

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశవ్యాప్తంగా 4Kలో తెలుగులో విడుదలవుతుంది. మహేష్ బాబు కమర్షియల్ యాస్పెక్ట్స్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు అంటే ఒక్కడు సినిమా అన్నట్లు ఒక మార్క్ సృష్టించి ఇండస్ట్రీ అంతా షేక్ చేసే విధంగా అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో జూన్ 26వ రీ రిలీజ్ కానుంది. గుణ శేఖర్ కెరియర్ లో అలాగే మహేష్ బాబు కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ మరోసారి అలరించేందుకు రానుంది. భూమిక చావ్లా హీరోయిన్గా నటించిన చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. ముఖేష్ రిషి, తెలంగాణ శకుంతల, అజయ్, గీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాజన్, అచ్యుత్ తదితరులు కీలకపాత్రను పోషించారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడుతూ… “మరోసారి ఒక్కడు రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అనేకసార్లు రీ రిలీజ్ అయింది. మహేష్ బాబు అభిమానులకు మరోసారి పండగ రాబోతుంది. రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఒకప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటే మాయాబజార్, పాతాళ భైరవి ఇలాంటి చిత్రాలను థియేటర్లో వేసేవారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మా ఒక్కడు సినిమా వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనెల 26వ తేదీన విడుదల కానున్న ఒక్కడు సినిమాను మరోసారి చూద్దాం” అన్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.