లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మైల్స్టోన్ ప్రాజెక్ట్ తలైవర్173 అఫీషియల్ టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ధర్మన్ ’ అనే టైటిల్‌ను లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా వదిలారు.ఈ చిత్రానికి డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రజనీ, డాకర్ట్ పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో రజనీకాంత్ ఒక డాక్టర్ (సర్జన్) కాస్ట్యూమ్‌లో సరికొత్త స్టైలిష్ అవతారంలో దర్శనమిచ్చారు. ఆపరేషన్ థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో నిలబడి, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని, చేతికి గ్లౌజ్ తొడిగి.. రక్తం అంటిన సర్జికల్ బ్లేడ్‌ను పట్టుకుని రజనీకాంత్ ఇచ్చిన పోజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన చేతికి ఉన్న డిజిటల్ వాచ్, తెల్లటి షూస్‌తో పాటు కింద రక్తం మడుగులో ఉన్న శవంపై కాలు పెట్టి నిల్చున్న తీరు చూస్తుంటే.. ఇదొక హై-వోల్టేజ్ వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు స్పష్టమవుతోంది.
నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా రేపటినుండి పట్టాలెక్కనుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. వీలైనంత తొందరగా ఈసినిమాను పూర్తి చేసి పొంగల్ బరిలో నిలుపాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























