నందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద నాన్‌స్టాప్ వసూళ్లతో అరాచకం సృష్టిస్తోంది. మొదటి 3 రోజుల్లోనే రూ. 43 కోట్లు కొల్లగొట్టిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం.. వర్కింగ్ డే అయిన సోమవారం (నాలుగో రోజు) కూడా స్ట్రాంగ్ హోల్డ్‌ను ప్రదర్శించి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.దాంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల హిస్టరీలోనే అత్యంత వేగంగా రూ. 50 కోట్ల మార్క్‌ను అందుకున్న చిత్రాలలో ఒకటిగా ‘మా ఇంటి బంగారం’ నిలిచింది. ఫస్ట్ వీకెండ్ ముగిసినా, సోమవారం నాడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం విశేషం.
ఇక నిన్న మెగాస్టార్ చిరంజీవి దంపతుల నుండి ప్రశంసలు, సత్కారం అందుకోవడంతో ఈ సినిమాకు మరింత భారీ మైలేజ్ లభించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ లాంగ్ రన్లో సినిమా రూ. 75 కోట్ల నుండి రూ. 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























