సంక్రాంతి బరిలోకి శర్వా – శ్రీను వైట్ల మూవీ  

Sharwa–Sreenu Vaitla Film Joins the Sankranti Race

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీనువైట్ల, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న నూతన చిత్రానికి సంబంధించిన ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం నేడు జూబ్లీ హిల్స్‌లో ఘనంగా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్‌షా వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీనువైట్ల, ఈసారి శర్వానంద్‌తో కలిసి మరో వినోదాత్మక చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

నారీనారీ నడుమ మురారీ, బైకర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెలుతున్న శర్వా, ఇప్పుడు శ్రీనువైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసివస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.