భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ఇసాకపట్నం ట్రైలర్ విడుదల’ ట్రైలర్ను హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లు, 15 భాషల సబ్టైటిల్స్తో ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా ప్రాంతాలలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేడు విడుదలైన ట్రైలర్ ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథను ఆవిష్కరించింది. నేరాలు, రాజకీయాలు, అధికార పోరాటాలు, వ్యక్తిగత విధేయతలు ఒకదానితో ఒకటి ఢీకొనే ఈ కథలో ఆశ, దురాశ, ప్రతీకారం ప్రధాన అంశాలు నిలుస్తాయి. అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్లగలరు విషయాన్ని ఈ సిరీస్ బలంగా చూపించనుంది. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, ఊహించని మలుపులతో నిండిన కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠ ఉంచుతుందని ట్రైలర్ స్పష్టం చేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























