లెనిన్ విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Lenin Gets a New Release Date After Postponement

అక్కినేని యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, మోస్ట్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లెనిన్’ విడుదల తేదీలో మార్పు జరిగింది. నిజానికి ఈ సినిమాను ఈ నెల జూన్ 26వ తేదీనే గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రయూనిట్ అంతా ప్లాన్ చేసింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, ప్రేక్షకులకు ఒక పర్‌ఫెక్ట్ ఎంటర్టైనర్ ను అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాను జూన్ నుండి జూలైకి వాయిదా వేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అఫీషియల్ రిలీజ్ డేట్ అప్‌డేట్‌ను ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ‘ఎ స్టోర్మ్ ఆఫ్ ఎమోషన్స్.. ఎ స్టోర్మ్ ఆఫ్ లవ్’ అంటూ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్, ఈ భారీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాబోయే జూలై 10, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. జూన్ 26న రావాల్సిన సినిమా కాస్త వాయిదా పడినప్పటికీ, జూలై 10న థియేటర్లలో అఖిల్ మార్క్ మాస్ తుఫాన్ ఖాయమని ఈ కొత్త పోస్టర్ హింట్ ఇస్తోంది.

కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కింగ్ అక్కినేని నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ సౌత్ సొంతం చేసుకుంది. జూన్ రిలీజ్ మిస్ అయినా, జూలై 10న సరికొత్త ప్లానింగ్‌తో మరియు భారీ ప్రమోషన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి అఖిల్ అక్కినేని ‘లెనిన్’ టీమ్ సిద్ధమైపోయింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.