యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ రోమాంటిక్ డ్రామా ‘దీవాన’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి సరికొత్త కథాంశంతో, ఇంటెన్స్ వన్ సైడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ టార్గెట్ గా తెరకెక్కింది ఈసినిమా. ఇక ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. హర్షిత్ రెడ్డి వన్ సైడ్ లవర్‌గా ఎంతో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ స్మేహ మణిమేఖలై తన హోమ్లీ లుక్స్‌తో, క్యూట్ యాక్టింగ్‌తో ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది.
వంశీ పచ్చిపులుసు అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా, రిచ్‌గా ఉన్నాయి. ఈశ్వర్ చంద్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని ఎమోషన్స్‌ను ఎలివేట్ చేసింది.
అర్హా మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ థియేటర్లలోకి తీసుకురాబోతోంది. సెన్సార్ నుండి ‘U/A’ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రం రెండు గంటల రెండు నిమిషాల క్రిస్ప్ రన్‌టైమ్‌తో లాక్ అయింది. ఈ చిత్రం జూన్ 19, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























