ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నసెయాన్

Seyon First Schedule Wrapped

విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సెయాన్. గత నెల మే 18న మధురైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఊహించని వేగంతో, రికార్డు సమయంలో పూర్తయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా విడుదల చేసిన అప్‌డేట్ పోస్టర్‌లో శివకార్తికేయన్ పక్కా సాంప్రదాయ దుస్తులలోచుట్టూ నిప్పురవ్వల మధ్య ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతోందని ఈ లుక్ చూస్తేనే అర్థమవుతోంది.

ఈ ఫస్ట్ షెడ్యూల్‌లోనే సినిమాకే హైలైట్‌గా నిలిచే ఒక భారీ జానపద గీతాన్ని చిత్రీకరించారు. ఏకంగా 1500 మంది డ్యాన్సర్లు, జానపద కళాకారులతో మధురై బ్యాక్‌డ్రాప్‌లో ఒక జాతరను తలపించేలా ఈ పాటను గ్రాండ్‌గా షూట్ చేశారు.

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ షెడ్యూల్‌లోనే వీరిద్దరి మధ్య వచ్చే ఒక బ్యూటిఫుల్ రోమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను కూడా కంప్లీట్ చేశారు.ఈసినిమాతో భాగ్యశ్రీ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

ఈ చిత్రానికి ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చే రూరల్ బీట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి. ఈ రూరల్ యాక్షన్ డ్రామాను 2026 చివరలో లేదా 2027 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.