ఇరుముడి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్

Irumudi Working Stills Released

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ సెట్స్ నుంచి బ్యూటిఫుల్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేశారు. ఈ స్టిల్స్ రవితేజ, ప్రియా భవానీ శంకర్, శివ నిర్వాణ నేచురల్ స్మైల్స్ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్  సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ‘ఇరుముడి’ షూటింగ్ ప్రయాణం ఓ అందమైన జ్ఞాపకం. సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఎన్నో మధుర క్షణాలను సొంతం చేసుకున్నాం. సెట్స్‌లో పుట్టిన సరదా జోక్స్, నవ్వులు, టీమ్‌తో గడిపిన ప్రతి క్షణం ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి, అలా ఎంతో ఆనందంగా ఫిలిం చేశాం. ‘ఇరుముడి’తో చేసిన ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం’ అని తన ఆనందంగా వ్యక్తం చేశారు.

ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించిన రవితేజ ‘ఇరుముడి’లో పూర్తిగా భిన్నమైన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన నటన ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది. మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో శివ నిర్వాణ ఈ కథను మనసుని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అదే సమయంలో కమర్షియల్ అంశాలను కూడా సమతూకంగా మేళవించారు.

ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పాత్రల్లో కనిపించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.