ఇప్పటివరకు ‘ఏక్ థా టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ యాక్షన్ బ్లాక్బస్టర్లను అందించిన యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నుండి వస్తున్న మొట్టమొదటి పూర్తిస్థాయి లేడీ లీడ్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. శివ్ రావల్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ నేడు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో అలియా భట్, శర్వరీ వాఘ్ ఇద్దరు పవర్ఫుల్ అండర్ కవర్ ఏజెంట్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్లో అలియా భట్ రా అండ్ రస్టిక్ విజువల్స్, ఇంటెన్స్ ఫైట్ సీన్స్, గన్‌ఫైట్స్ మరియు స్టంట్స్‌తో మైండ్ బ్లాక్ చేసింది.
ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే.. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో అలియా భట్‌కు తండ్రిగా అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయట.
ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అలియా భట్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో, సరికొత్త మాస్ మేకోవర్‌తో రాబోతున్న ఈ క్రేజీ స్పై థ్రిల్లర్ జూలై 10, 2026 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























