టాక్సిక్ నుండి క్రేజీ మేకింగ్ వీడియో రిలీజ్

Toxic Making Video Out Now

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 19వ ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు గీతు మోహన్‌దాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘టీమ్ టాక్సిక్’ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ లాంటి బీటీఎస్ వీడియోను షేర్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాధారణంగా భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలను స్టార్ మెయిల్ డైరెక్టర్లు హ్యాండిల్ చేయడం చూస్తుంటాం. కానీ గీతు మోహన్‌దాస్ ఈ భారీ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా లీడ్ చేస్తున్నారో ఈ వీడియో నిరూపిస్తోంది.

ఈ 1-నిమిషం వీడియోలో గీతు మోహన్‌దాస్ సెట్స్‌పై టెక్నీషియన్లతో, స్టంట్ కొరియోగ్రాఫర్లతో చర్చిస్తూ యాక్షన్ సీన్లను వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. క్రిస్టియన్ సెమెట్రీ (క్రిస్టియన్ శ్మశాన వాటిక) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే బ్లాస్టింగ్ సీన్స్, సర్కస్ సెటప్స్, క్లబ్/బార్ మరియు స్ట్రీట్ ఫైట్స్ సీక్వెన్స్‌లను ఆమె ఎలా ప్లాన్ చేశారో ఇందులో చూపించారు.

హీరో యష్ (రాయా పాత్ర) క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం గీతు మోహన్‌దాస్ ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న విజువల్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని బట్టి సినిమాలో యష్‌ను సరికొత్త స్టైలిష్ మాస్ అవతారంలో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

“డైలాగ్స్ కంటే నిశ్శబ్దమే ఎక్కువ మాట్లాడేలా.. ప్రతి షాట్ ఎంతో వైవిధ్యంగా ఉండేలా వెనక ఉండి నడిపించిన కెప్టెన్ ఆమె.. హ్యాపీ బర్త్ డే గీతు మోహన్‌దాస్” అంటూ మేకర్స్ ఈ వీడియోకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. హ్యూమా ఖురేషి, తారా సుటారియా, రుక్మిణీ వసంత్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.