వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ ఎప్పటినుంచంటే ?

Shooting Update on the Venkatesh–Nandamuri Kalyan Ram–Anil Ravipudi Multistarrer

టాలీవుడ్‌లో సరికొత్త మల్టీస్టారర్ ధమాకాకు రంగం సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ భారీ మల్టీస్టారర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుండి ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ప్లాన్ చేశారు.సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ అనిల్ రావిపూడి తన సినిమాలకు షూటింగ్ ప్రారంభమయ్యే రోజు నుండే ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తాడు. ఇక తన కొత్త సినిమాకు కూడా ఇదే ఫార్ములా ఫాలో కానున్నాడు.

ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ పూర్తి స్థాయి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇద్దరు అగ్ర హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పండగలా ఉండబోతోంది.కమర్షియల్ సినిమాలకు కామెడీని, ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా జోడించడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఈ చిత్రంలో కూడా అనిల్ రావిపూడి మార్క్ హిలేరియస్ కామెడీతో పాటు గుండెకు హత్తుకునే సాలిడ్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా కుదిరాయని ఇండస్ట్రీ టాక్.

జూన్ నుండి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి 2027 కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ గట్టి ప్లానింగ్‌తో ఉన్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబోకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది (ఎఫ్2, ఎఫ్3 వంటి సక్సెస్ లే ఇందుకు ఉదాహరణ). ఇప్పుడు దీనికి కళ్యాణ్ రామ్ తోడు కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.