ప్రధాని మోదీ గారు పెద్ది గురించి అడిగారు – రామ్ చరణ్

Prime Minister Narendra Modi Asked Me About Peddi says Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఢిల్లీ ప్రెస్ మీట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో నిజాయితీగా పనిచేశాం. అంకితభావం కలిగిన దర్శకుడు బుచ్చిబాబు గారు, నిర్మాత సతీష్ గారు, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, బోమన్ ఇరానీ గారు, దివ్యేందు ఇలా అద్భుతమైన టీమ్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. దేవుడి దయ వల్లే ఇదంతా సాధ్యమైందని భావిస్తున్నాను. గత రెండున్నర సంవత్సరాలుగా ఎంతో డెడికేషన్‌తో ఈ సినిమా చేశాం. ఇది చాలా గొప్ప ఎంటర్‌టైనర్. ప్రేక్షకులను ఇన్‌స్పైర్ చేసే సినిమా. ఈ సినిమాను పిల్లలతో కలిసి థియేటర్లలో చూడండి. వాళ్లు చాలా ఇన్‌స్పైర్ అవుతారు. ఇది మట్టి వాసన ఉన్న కథ. గతంలో నేను చేసిన రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భారతదేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు చాలామంది ట్రైబల్ ప్రాంతాల నుంచే వచ్చారు.

నేను ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు పెద్ది దేనికి గురించి అని అడిగారు. గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. అప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వెస్ట్ బెంగాల్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు పైన జెర్సీ, కింద లంగోటా ధరించి కనిపించారని, వాళ్లు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చామని చెప్పారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మొహమ్మద్ అనే వ్యక్తి భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడాడు. ఇప్పుడు అదే గ్రామం నుంచి 80 శాతం మంది ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఒక్క వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో అది చూపిస్తుంది. ‘పెద్ది’ కూడా అలాంటి ఒక కథ. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు తన ఐడెంటిటీ కోసం ఎలా పోరాడాడనేది పెద్దిలో చూస్తారు. ఈ పాత్రకు ఏం కావాలో అంతా ప్రాణం పెట్టి చేశాను. జూన్ 4న సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్లలో చూసి సపోర్ట్ చేయాలి. ఇది లార్జ్ స్కేల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. మీకు సినిమా నచ్చితే తప్పకుండా ప్రమోట్ చేయండి. అందరికీ థాంక్యూ.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.