సూపర్ స్టార్ మహేష్ బాబు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన హ్యాండ్సమ్ లుక్స్, పవర్ఫుల్ డైలాగ్స్. కానీ ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబు కేవలం ఒక గ్లామర్ హీరోగా కాకుండా.. ఒక నటుడిగా తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. గతాన్ని మర్చిపోయి, మానసిక సంఘర్షణ తో బాధపడే రాక్‌స్టార్ గౌతమ్ పాత్రలో ఆయన జీవించేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తల్లిదండ్రులను చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే తపన, అసలు తన చుట్టూ ఉన్నది నిజమా భ్రమా అని తెలియక తల్లడిల్లే సీన్లలో మహేష్ బాబు కళ్లలోనే ఎమోషన్స్ పలికించిన తీరు అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఐరిష్ లొకేషన్లలో వచ్చే ఎమోషనల్ బ్లాక్ ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా చేస్తుంది.ఇక ఇప్పుడు మహేష్ బాబు లోని తిరుగులేని నటుడిని వెండితెరపై 4K క్వాలిటీలో చూసే అవకాశం దక్కనుంది.
ఈనెల 31న 1 నేనొక్కడినే గ్రాండ్ గా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ , ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























