రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నాను – రామ్ చరణ్ 

I’m Returning After Two and a Half Years with Peddi Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెంగళూరు ప్రెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. కన్నడ ప్రేక్షకులందరికీ నమస్కారం. అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు నచ్చిన పని, తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ, దేవుడికి నమస్కరిస్తున్నాను. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో నిజాయితీగా, ప్రాణం పెట్టి పనిచేశాం. రాసిపెట్టుకోండి… ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. శివన్న నాకు ఒక ఫాదర్, ఒక అంకుల్, ఒక బ్రదర్‌లాంటి వారు. ఆయన భారతీయ సినీ పరిశ్రమలో ఒక లెజెండ్, కన్నడ చిత్రసీమకు చక్రవర్తి. అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఏఆర్ రెహమాన్ గారు ఈ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. జాన్వీ గారు కూడా ఈ సినిమా కోసం ఎంతో నిజాయితీగా పనిచేశారు. మా నిర్మాత సతీష్ గారికి ఇది తొలి చిత్రం. ఆయన హార్ట్ ఫుల్ గా చేశారు. బుచ్చిబాబు లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే జగపతిబాబు గారికి, డీవోపీ రత్నవేలు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా జరగడానికి ప్రధాన కారణమైన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా జీవితంలో నేను చేసిన మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిలిం ‘పెద్ది’. జూన్ 4న మీరందరూ తప్పకుండా థియేటర్లలో ఈ సినిమాను చూస్తారని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.