జులైలో రిలీజ్ కానున్న ఎపిక్ .. సెకండ్ సింగిల్ రిలీజ్

Second Song from Epic Out Now; Film Releasing in July

‘బేబీ’ లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ల మోస్ట్ లవ్డ్ ఆన్-స్క్రీన్ జంట మళ్లీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ . ‘90s’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాను సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం జులైలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘ప్రియసఖి’ సాంగ్‌ను విడుదల చేశారు.

: ‘ఖుషి’ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మరోసారి తన మ్యూజికల్ బ్రిలియన్స్‌ను నిరూపించుకున్నారు. వినేకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఒక అద్భుతమైన, ప్రశాంతమైన మెలోడీ ట్యూన్‌ను కంపోజ్ చేశారు. లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రాణంగా నిలిచింది. “సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెల ఇది” అంటూ సాగే లైన్స్ లవ్లీగా ఉన్నాయి. ఇక సింగర్ కేఎస్ హరిశంకర్ తన సాఫ్ట్ అండ్ ఎమోషనల్ వోకల్స్‌తో ఈ మెలోడీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.

విజువల్స్ పరంగా ఈ సాంగ్ ఒక వండర్‌లా ఉంది. లండన్ నగరంలోని అత్యంత అందమైన లొకేషన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య ఉన్న కెమిస్ట్రీ మ్యాజికల్‌గా సాగింది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా వచ్చిన ఈ ‘ప్రియసఖి’ సెకండ్ సింగిల్ యూత్‌కు మరింతగా కనెక్ట్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. జులైలో రాబోతున్న ఈ ‘ఎపిక్’ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.