2700 VFX షాట్స్‌తో నిఖిల్ స్వయంభు సరికొత్త రికార్డు

Nikhil Siddhartha’s Swayambhu Sets New Record with 2700 VFX Shots

కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ వర్సటైల్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ . భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘స్వయంభు’ చిత్రాన్ని వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా ఆవిష్కరించడానికి మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదు. అందుకోసం ఈ సినిమాలో ఏకంగా 2700 వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను ఉపయోగిస్తున్నారు. టాలీవుడ్ హిస్టరీలోనే ఒక పీరియాడిక్ ఫిలిం కోసం ఈ స్థాయి గ్రాఫిక్స్ షాట్స్ వాడటం ఒక నయా రికార్డ్ అని చెప్పవచ్చు.

హాలీవుడ్ రేంజ్ ఔట్‌పుట్ ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకున్న చిత్ర యూనిట్.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో చేతులు కలిపింది. దాదాపు 750 మందికి పైగా సీజీ ఆర్టిస్టులు రాత్రింబవళ్లు నాన్-స్టాప్‌గా శ్రమిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. యుద్ధ సన్నివేశాలు, పురాతన సామ్రాజ్యాల విజువల్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా డీఓపీ సెంథిల్ కుమార్ తో కలిసి హీరో నిఖిల్ స్వయంభు విఎఫ్ఎక్స్ పనులు చేస్తున్న ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్లి అప్డేట్స్ అడిగి తెలుసుకున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతుని అందించేందుకే ఇంత సమయం తీసుకున్నట్లు నిఖిల్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్‌ఫుల్ యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన నిఖిల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేయగా.. గ్రాఫిక్స్ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా విజువల్ ట్రీట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.