సత్యదేవ్ కొత్త సినిమా సమవర్తి … ఫస్ట్ లుక్ రిలీజ్

First Look Poster of Samavarthi Out Now

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ సరికొత్త యాక్షన్ మోడ్‌లోకి మారిపోయాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు తన 16వ చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సత్యదేవ్ హీరోగా నటిస్తున్న #SD16 చిత్రానికి ‘సమవర్తి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్యదేవ్ చేతిలో గొడ్డలి పట్టుకుని, మునుపెన్నఈ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో సత్యదేవ్ నోట్లో సిగరెట్‌తో, నుదుటిపై రక్తం కారుతున్న గాయంతో, చుట్టూ ముంచుకొస్తున్న ముప్పును సైతం లెక్కచేయకుండా ఎంతో గంభీరంగా కనబడుతూ . అతని చుట్టూ రక్తం చిందిస్తున్న పదునైన గొడ్డళ్లు, కత్తులు పట్టుకున్న శత్రువుల చేతులు భీతిగొలిపేలా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని ఇటీవల ‘ఆరంభం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ నాగ్ వి. తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను పవర్‌ఫుల్ ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఒక వైల్డ్ రైడ్‌లా సాగే ఈ కథలో సత్యదేవ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా, గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త అడ్రినలిన్ రష్ ఇచ్చే యాక్షన్ మోడ్‌లో ఉండబోతోందని చిత్రబృందం పేర్కొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.