మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల వివాహం తర్వాత వెండితెరపై లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సతీ లీలావతి’ .ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సమ్మర్ సీజన్‌లో థియేటర్ల వద్ద ఉన్న డ్రై పీరియడ్ కారణంగా ఈ సినిమా థియేట్రికల్ రన్ చాలా త్వరగానే ముగిసిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఎవరూ ఊహించని విధంగా కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చింది.ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు ‘సన్ నెక్స్ట్’ మరియు ‘జియో హాట్‌స్టార్’ సంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. మే 20 నుంచి తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది.
కథ :
సినిమాలో లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సక్సెస్‌ఫుల్ స్టార్ డైరెక్టర్. చిన్నతనం నుంచి ఇంట్లో తల్లిదండ్రుల గొడవల వల్ల కొన్ని మానసిక భయాలతో పెరుగుతుంది. దర్శకురాలు కావడానికి ముందు తనలో భయాన్ని పోగొట్టుకోవడంలో సహాయం చేసిన సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్)తో ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది.
కానీ, పెళ్లైన మూడేళ్ల తర్వాత కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. తాను నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, తనకు విడాకులు కావాలని రామ్ సేతు భార్యను కోరతాడు. దీంతో తీవ్ర షాక్‌కు గురైన లీలావతి భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? చివరికి ఈ జంట ఎలా ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























