గ్రాండ్ గా లాంచ్ అయిన మెగా 158 …ముఖ్య అతిథి గా పవన్ కళ్యాణ్ 

Grand Launch Event Held for Mega 158 with Pawan Kalyan as Chief Guest

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ మాస్ ఎంటర్‌టైనర్ ‘#Mega158’ (వర్కింగ్ టైటిల్) ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్ర ఓపెనింగ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై, సినిమా ముహూర్తపు సన్నివేశానికి మొదటి క్లాప్ కొట్టారు.

ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం.. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకలో దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేష్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఈ ఏడాది ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు స్కై హై లో ఉన్నాయి. ఈ సినిమాను బాబీ ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. సోషల్ మీడియాలో ఈ చిత్రం కోసం ‘కాకా’ అనే టైటిల్ గట్టిగా వినబడుతోంది.

ఎస్.ఎస్. తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనుంది.
కన్నడలో భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 28 నుండి హైదరాబాద్‌లోనే ప్రారంభం కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.