NBK111 లో కీలక పాత్రలో కనిపించనున్న మంచు మనోజ్

Manchu Manoj Joins the Cast of NBK111

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘#NBK111’ నుంచి ఒక సెన్సేషనల్ కాస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు మంచు మనోజ్ పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా ఈ క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

చిత్ర బృందం పాత్ర వివరాలను పూర్తిగా లీక్ చేయనప్పటికీ.. ఈ సినిమాలో మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు ట్రేడ్ వర్గాల బలమైన సమాచారం. ఇటీవల ‘మిరాయ్’, ‘భైరవం’ చిత్రాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించిన మనోజ్.. ఇప్పుడు ఏకంగా ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణను ఢీకొట్టడానికి సిద్ధమవ్వడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందిస్తూ.. “పవర్‌హౌస్ పెర్ఫార్మర్ మంచు మనోజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ భారీ ప్రయాణంలో మీరు భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీ ఎనర్జీ, ఇంటెన్సిటీ వెండితెరపై ఒక ప్రత్యేక మ్యాజిక్ సృష్టించబోతున్నాయి.. అది చూడటానికి నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.

గతంలో 2012లో వచ్చిన ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రంలో బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి నటించారు. ఆ సినిమాలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేయగా, ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఇక ఈ అప్‌డేట్‌పై మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ థాంక్స్ చెప్పారు:

“కొన్ని పుట్టినరోజులు దేవుడిచ్చిన వరాల్లా వస్తాయి. నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రత్యేకమైన గిఫ్ట్ ఈ బర్త్ డే నాకు ఇచ్చింది. మా లయన్ బాలయ్య అన్నతో, గోపీచంద్ గారి దర్శకత్వంలో నటించాలనే నా కల నెరవేరుతోంది. ఈ ప్రాజెక్ట్ నా హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉంటుంది. థియేటర్లలో మీకు గ్యారెంటీగా ఒక సాలిడ్ మాస్ విందు భోజనం ఉంటుంది!”

వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రమిది. ఇందులో బాలకృష్ణ సరికొత్త ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జైసింహా’ తర్వాత వస్తున్న నాల్గవ చిత్రమిది.

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.