మెగా 158 సినిమాకు తమన్ మ్యూజిక్

Thaman to Compose Music for Mega 158

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ మెగా 158వ చిత్రం రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. రూత్ లెస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించనున్నాడు.ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ ఈరోజు అధికారికంగా ప్రకటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఇక ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు.దాంతో ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక తమన్ తోపాటు ఈసినిమాకు స్ట్రాంగ్ టెక్నికల్ టీం ను తీసుకున్నారు. అందులో భాగంగా విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్ల , ఎడిటర్ గా రూబెన్స్ ను తీసుకున్నారు.

కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈసినిమాను నిర్మించనుంది. తెలుగులో ఈ సంస్థకు ఇదే మొదటి సినిమా. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.