సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా RAPO 23

Psychological Action Thriller RAPO 23 Announced

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో ఒక భారీ అడుగు వేస్తున్నారు. తన 23వ చిత్రం (#RAPO23) ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ పోతినేని స్వయంగా ఈ చిత్రానికి కథను అందిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక సైకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రామ్ ‘వీర’ అనే పాత్రలో చేయనున్నాడు.ప్రీ లుక్ పోస్టర్‌లో రామ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీనికి ఓ ఒంటరి తోడేలు కథ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు.

రామ్ అన్నయ్య కృష్ణ చైతన్య పోతినేని, రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.జూన్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2026లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నటుడిగా మెప్పించిన రామ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఏ స్థాయిలో అదరగొడతారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.