అగ్లీ స్టోరీతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది – వివి వినాయక్

Ugly Story Will Give Nandu a Good Break says V. V. Vinayak

ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందు, అవికా గోర్ జంటగా మే 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం అగ్లీ స్టోరీ. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్ర విడుదల తేది దగ్గరవుతున్న సమయంలో అగ్ర దర్శకులు వివి వినాయక్ గారు ఈ చిత్ర టైలర్ చూసి బృందానికి తన ఆశీస్సులను తెలిపి అండగా నిలబడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకులు వివి వినాయక్ గారు మాట్లాడుతూ… “కాకినాడలో ఒక థియేటర్ యజమాని ప్రణవ స్వరూప్ కుటుంబానికి మా కుటుంబంతో ఎంతో కాలంగా మంచి పరిచయం ఉన్న సన్నిహితులు. అగ్లీ స్టోరీ చిత్ర బృందం అందరితో నాకు మంచి పరిచయం ఉంది. అందరిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లే బెక్కం వేణుగోపాల్ గారు, అలాగే నటుడు నందు కలిసి చేసిన సినిమా ఇది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన భార్య గీత మాధురి మా ఇంటి ఆడపడుచు వంటి వారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టైటిల్ కొత్తగా ఉన్న మంచి లవ్ స్టోరీ ఇది. మే 22వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించాలి” అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ… “మా సినిమా ట్రైలర్ దర్శకులు వివి వినాయక్ గారికి చూపించాము, ఆయనకు చాలా నచ్చింది. సినిమా మంచి విజయం సాధించాలని ఆయన మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ… “టైలర్ చూసి వినాయక్ గారు చాలా ప్రశంసించారు. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. మే 22వ తేదీన విడుదల కానున్న అగ్లీ స్టోరీ చిత్రాన్ని అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు నందు మాట్లాడుతూ… “ముందుగా మా సినిమాకు అండగా నిలబడిన వివి వినాయక్ గారికి థాంక్స్. ఆయన ఆశీర్వాదం పొందడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మే 22న మా సినిమా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.