కరుప్పు మార్నింగ్ షోస్ క్యాన్సల్

Karuppu Morning Shows Cancelled

సూర్య, త్రిష జంటగా సుమారు 20 ఏళ్ల తర్వాత వస్తున్న ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రానికి సంబంధించి మే నేడు ఉదయం 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఇది సూర్య అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా విడుదలకు ప్రధాన ఆటంకం చిత్ర నిర్మాణ సంస్థ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ మరియు ఫైనాన్సియర్ల మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీలని తెలుస్తోంది. బుధవారం రాత్రి వరకు కూడా ఈ ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరిగాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ గతరాత్రి వరకు ధీమా వ్యక్తం చేసినప్పటికీ, ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాకపోవడంతో నిర్మాత ఎస్.ఆర్. ప్రభు అర్ధరాత్రి సమయంలో సోషల్ మీడియా ద్వారా ఉదయం షోలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తమిళనాడులో సాధారణంగా ఉదయం 9 గంటల షోలకు అనుమతి ఉండదు. అయితే, ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ చేసిన విన్నపాన్ని మన్నించి, నూతన ముఖ్యమంత్రి విజయ్ మే 14న ఉదయం 9 గంటల స్పెషల్ షోలకు ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు. ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు లభించినప్పటికీ, అంతర్గత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ విలువైన స్పెషల్ షోలను చిత్ర యూనిట్ కోల్పోవాల్సి వచ్చింది.అటు ఓవర్సీస్ లోనూ ప్రీమియర్స్ షోస్ రద్దయ్యాయి.

ఈ చిత్రం గత 32 నెలలుగా నిర్మాణంలో ఉంది. ఎన్నో వాయిదాల తర్వాత థియేటర్ల ముందుకు వస్తున్న తరుణంలో ఇలాంటి ఆటంకాలు ఎదురవ్వడంపై సూర్య అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల షో లేదా మ్యాట్నీ నుండి సినిమా థియేటర్లలో ప్రదర్శించబడే అవకాశం ఉంది. తెలుగులో ఈసినిమా వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా మధ్యాహ్నం నుండి షోలు పడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.