నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రీ షూట్ వార్తలపై చిత్ర బృందం ఘాటుగా స్పందించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై హీరో నాని అసంతృప్తిగా ఉన్నారని, అందుకే వాటిని మళ్ళీ చిత్రీకరిస్తున్నారని (రీ షూట్) వచ్చిన వార్తలను మేకర్స్ పూర్తిగా ఖండించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. మొదటి రోజు నుంచే పక్కా ప్రణాళికతో, స్పష్టమైన విజన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 100 రోజులకు పైగా చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిందని, మిగిలిన షెడ్యూల్స్ కూడా అనుకున్న సమయానికే జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా రీ షూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి అవసరం రాదని తేల్చి చెప్పారు.
సినిమా ఆలస్యమవుతుందనే వార్తల్లో కూడా నిజం లేదని, ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుందని ధృవీకరించారు.సినిమా గురించి వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, కేవలం చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే అప్‌డేట్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అభిమానులను కోరారు.
సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో నాని సరసన కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























