రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘పెద్ది’సినిమా సెట్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్టి సందడి చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తన సోషల్ మీడియా ద్వారా అందుకు సంబందించిన ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. చిరంజీవి సెట్స్‌కు రావడమే కాకుండా, షూటింగ్ జరుగుతున్న తీరును, తన కుమారుడు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ను దగ్గరుండి గమనించారు. మెగాస్టార్ సెట్స్‌కి రావడంతో చిత్ర యూనిట్ అంతా ఎంతో ఉత్సాహంగా కనిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బుచ్చిబాబు ఈ వీడియోను షేర్ చేస్తూ, చిరంజీవి గారి రాక తమ టీమ్ అందరికీ ఒక గొప్ప ఆశీర్వాదం అని, ఆయన సమక్షం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ఊర మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో, మెగాస్టార్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘పెద్ది’ లో జాన్వీ కపూర్ హిరోయిన్ గా నటించగా శివ రాజ్ కుమార్ , జగపతి బాబు ,దివ్యేన్డు శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ప్రమోషన్స్ లోకూడా జోరు పెంచారు. జూన్ 4న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























