ఓటీటీలోకి రానున్న ధురంధర్ 2

Dhurandhar 2 Set for OTT Premiere

ఓటీటీలోకి రానున్న ధురంధర్ 2రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఈ అప్‌డేట్‌ను అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవర్సీస్ ప్రేక్షకులకు మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా డిజిటల్ ప్రీమియర్ కోసం 3 గంటల 52 నిమిషాల నిడివితో కూడిన ‘అన్‌కట్ వెర్షన్’ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక భారతదేశంలో ఈ చిత్రం ‘జియో హాట్‌స్టార్’ వేదికగా మే 15 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై జియో హాట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించగా సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేసే ఒక గూఢచారి సాహసోపేతమైన కథతో ఈ సినిమా రూపొందింది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 1700కోట్లకుపైగా వసూల్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.అంతకుముందు గత ఏడాది చివర్లో విడుదలైన ధురంధర్ పార్ట్ 1 కూడా 1200కోట్లకుపైగా వసూళ్లతో సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.