తన నెక్స్ట్ మూవీని ప్రకటించిన నారా రోహిత్ 

New Movie Announcement from Nara Rohith

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే రోహిత్ నారా, కరణ్ సి ప్రొడక్షన్స్ LLPతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన 5వ ప్రొడక్షన్ గా రూపొందుతున్న #RN23 కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఈ ప్రాజెక్ట్‌ను భరత్ చౌదరి నిర్మిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“షౌటింగ్ సూన్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలను కలగలిపిన వినోదాత్మక కథతో ఈ సినిమా రాబోతోంది.  

త్వరలోనే ముహూర్తం వేడుకతో చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇతర నటీనటులు, సాంకేతిక బృందం రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.