శ్రీనివాస మంగాపురం నుంచి బాలుగా బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ రిలీజ్ 

Brahmaji’s Balu First Look from Srinivasa Mangapuram Out

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  

ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బాలు’ పాత్రలో ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో మైక్ పట్టుకొని హ్యాపీ వైబ్ లో కనిపించారు బ్రహ్మాజీ. 

‘బాలు’ పాత్ర అందరిని థియేటర్లలో పక్కాగా ఎంటర్‌టైన్ చేయబోతుంది. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పి కిరణ్ నిర్మిస్తున్నారు. 

టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీతాన్ని జివి ప్రకాశ్ కుమార్ సమకూరుస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ ISC, ఎడిటింగ్ బాధ్యతలను మాధవ్ కుమార్ గుల్లపాటి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.