పెద్ది స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ ఫిక్స్ 

Shruti Haasan Confirmed for Special Song in Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం ప్రముఖ నటి శ్రుతి హాసన్ ను ఖరారు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాట చిత్రీకరణ రేపు హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ప్రారంభం కానుంది. నాలుగు నుండి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇంతకుముందు రామ్ చరణ్, శ్రుతి హాసన్ కలిసి ఎవడు లో నటించారు. ఇక ఇప్పుడు పెద్దిలో స్టెప్పులు వేయనున్నారు. వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.ఇక ఈ స్పెషల్ సాంగ్ కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని సమాచారం.

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, ఇప్పుడు జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.