విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – AK 47’.ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా కోసం ఒక భారీ ట్రైన్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో వెంకటేష్ మరియు చిత్రంలోని ఇతర ప్రధాన నటీనటులపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని వినోదాత్మక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్ లోని వెంకీ – త్రివిక్రమ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్ సినిమాలోని అతి ముఖ్యమైన ఇంటర్వెల్ బ్లాక్ కోసం అని తెలుస్తోంది.ఈ షెడ్యూల్ తో సగానికిపైగా షూట్ కంప్లీట్ కానుంది.
ఈ చిత్రంలో వెంకటేష్ ఒక మధ్యతరగతి కుటుంబ పెద్దగా కనిపిస్తూనే, కథా పరంగా వచ్చే మలుపుల వల్ల పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లే పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ఈసారి యాక్షన్ ఎలిమెంట్స్‌ను మరింత భారీగా ప్లాన్ చేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఈ ట్రైన్ సెట్‌ను అత్యంత సహజంగా ఉండేలా తీర్చిదిద్దింది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ తదుపరి చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్ పాత్రలో ఉదయ్ వీర్ సంధు కనిపించబోతున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ వేగంగా పూర్తి చేసి, దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























