వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయం

Varun Tej Sustains Injury to His Leg

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘బరి’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించాల్సి వుంది. ఈ సినిమాలో ఆయన వాలీబాల్ ప్లేయర్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర కోసం గత కొన్ని నెలలుగా ఆయన వాలీబాల్ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్‌లో ఉండగా ఆయన కాలికి తీవ్ర గాయమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గాయం తీవ్రతను గమనించిన వైద్యులు ఒక చిన్న శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీనితో ఈరోజు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరుగనుంది. సర్జరీ తరువాత పూర్తి కోలుకున్నాక వరుణ్ తేజ్ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. యదు వంశీ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా సంక్రాంతికి విడుదలచేయనున్నారు.

ఇక వరుణ్ ఈసినిమా కన్నా ముందు కొరియన్ కనకరాజుతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా మే చివర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.