అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ నుండి అభిమానులకు ఒక క్రేజీ సర్ప్రైజ్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట ‘యెట్టా యెట్టా’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. సాధారణంగా సినిమాలకు మొదట లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు, కానీ ‘లెనిన్’ టీమ్ నేరుగా వీడియో సాంగ్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ పాట ఏప్రిల్ 16, 2026న విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది ఒక మాస్, పెప్పీ అండ్ ఇన్స్టంట్ అడిక్టివ్ ట్రాక్ అని, అఖిల్ మాస్ స్టెప్పులు ఈ సాంగ్‌లో హైలైట్‌గా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
అక్కినేని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) మరియు నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్) సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘వారేవా వారేవా’ పాట మరియు టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ సినిమా జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఏప్రిల్ 16న రాబోయే ఈ వీడియో సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























