హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా చూసి, ఇంత టాలెంటెడ్ టీమ్‌ను కలిసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది. శేష్ సినిమా హిట్ అయ్యేవరకు తీస్తుంటాడు. సుప్రియ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన తర్వాత ఏ సినిమాతోనూ పోలిక కనిపించలేదు. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి. సినిమాలో అందరూ బ్రహ్మాండంగా చేశారు. డైరెక్టర్ శానిల్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. మృణాల్ సరస్వతి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. ఇదివరకు ఒక అమ్మాయిని ఆశీర్వదించాను, ఆమె వరుణ్ భార్య అయింది (నవ్వుతూ). మృణాల్ కూడా ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆమె ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ సినిమా నాకు చాలా నచ్చింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























