గోపిచంద్ భరతవర్ష గ్లింప్స్ అదిరింది

BharataVarsha – Saga of Shula Title Glimpse released

మ్యాచో స్టార్ గోపిచంద్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాకు ‘భరతవర్ష’ అనే పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉన్న పేరును ఖరారు చేశారు. గ్లింప్స్‌లో గోపిచంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక యోధుడి పాత్రలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ మరియు గెటప్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

7వ శతాబ్దానికి చెందిన అన్వేషించని కథాంశం కావడంతో, సంకల్ప్ రెడ్డి విజువల్స్ చాలా రిచ్‌గా మరియు గ్రాండ్‌గా ఉన్నాయి. యుద్ధ వాతావరణం మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కు తగ్గట్టుగా చాలా ఎలివేటింగ్ గా ఉంది.ఓవరాల్ గా సాగా ఆఫ్ శూల అంటూ వచ్చిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గోపిచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది. ఈఏడాది ద్వితీయార్ధంలో ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.