నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో, ఈ రెండో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్లో కయాదు లోహర్ పాతకాలపు స్టైల్లో సైకిల్ తొక్కుతూ చాలా నేచురల్ లుక్‌లో కనిపిస్తోంది. పల్లెటూరి వాతావరణం, వెనుక కనిపిస్తున్న మనుషులు మరియు గాడిదలను చూస్తుంటే ఇది పక్కా రా అండ్ రస్టిక్ పీరియడ్ డ్రామా అని అర్థమవుతోంది.ఇందులో సుబ్బలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది.
ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























