చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థాంక్యూ మీట్‌లో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ప్రీమియర్స్ నుంచే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అభినందించారు. చూసిన వాళ్లందరూ కూడా ఇంత అద్భుతంగా ఎలా తీశారని అడుగుతున్నారు. టెక్నికల్‌గా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో రేసింగ్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతున్నారు. ఫాదర్ అండ్ సన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమాను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇది చాలా లాంగ్ రన్ ఉండే సినిమా. ఈ సమ్మర్ అంతా బైకర్ దే. మా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నన్ను నమ్మిన శర్వా గారికి థాంక్యూ. రాజశేఖర్ గారు, శర్వా గారి మధ్య ఎమోషన్ అద్భుతంగా పండింది. ఈ క్యారెక్టర్ చేసినందుకు రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు. థియేటర్ కి వెళ్లి చూడండి.తప్పకుండా అందరికీ సినిమా నచ్చుతుంది.”
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































