గోపిచంద్ 33 టైటిల్ గ్లింప్స్ అప్డేట్ 

Gopichand 33 Title Glimpse Release Date Locked

మ్యాచో స్టార్ గోపీచంద్ మరియు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న #Gopichand33 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే తీపి కబురు అందించారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ గ్లింప్స్ విడుదల తేదీని ఖరారు చేశారు.ఏప్రిల్ 13, 2026న ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాన్సెప్ట్: “From a timeless age rises an untold saga” (ఒక కాలాతీత యుగం నుండి చెప్పబడని వీరగాథ ఉద్భవిస్తుంది) అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామా అని స్పష్టమవుతోంది. గోపిచంద్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది.

‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంకల్ప్ రెడ్డి మార్కు మేకింగ్‌తో, గోపీచంద్ మాస్ ఇమేజ్‌కు తగినట్లుగా ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ 13న రాబోయే ఈ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచడం ఖాయం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.