కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా లీక్ అవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు ముందే లీక్ అవ్వడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని చిరంజీవి పేర్కొన్నారు. ఒక సినిమా అంటే ఎంతోమంది శ్రమ, నమ్మకం మరియు సమష్టి కలల సమాహారమని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయని, మన క్రియేటివ్ వర్క్‌ను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఇవి గుర్తుచేస్తుంటాయని తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో తామంతా కెవీఎన్ (KVN) ప్రొడక్షన్స్‌కు అండగా ఉంటామని, పైరసీని అరికట్టడంలో మరియు దోషులను శిక్షించడంలో ఏకతాటిపై నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని చిరంజీవి పిలుపునిచ్చారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా, మమితా బైజు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ వివాదాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఐదు నిమిషాల సీన్ మరియు ఒక పాట ఆన్లైన్లో లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































