జన నాయగన్ పైరసీపై తీవ్రంగా స్పందించిన కేవీఎన్ ప్రొడక్షన్స్

Strong Reaction from KVN Productions Over Jana Nayagan Leak

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “జన నాయగన్” సినిమాకు పైరసీ సెగ తగిలింది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మరియు క్లిప్పులు ఇంటర్నెట్‌లో అక్రమంగా ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ తీవ్రంగా స్పందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు వారు ఒక అధికారిక పబ్లిక్ నోటీసును విడుదల చేస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు:

సోషల్ మీడియాలో లీకైన కంటెంట్‌ను షేర్ చేస్తున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే ఫోరెన్సిక్ విచారణ ప్రారంభించినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రతి డిజిటల్ కదలికను ట్రాక్ చేస్తున్నామని వెల్లడించారు.

వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లేదా టోరెంట్స్ వంటి ఏ మాధ్యమం ద్వారా అయినా లీకైన వీడియోలను షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం లేదా స్టోర్ చేయడం చట్టరీత్యా నేరం. అలా చేసే వారిపై సివిల్ మరియు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఒకవేళ మీ మొబైల్‌కు లేదా సోషల్ మీడియా ఖాతాలకు ఈ లీక్డ్ కంటెంట్ వస్తే, దయచేసి దాన్ని ఓపెన్ చేయవద్దు. వెంటనే దాన్ని డిలీట్ చేసి, పైరసీని అరికట్టడంలో చిత్ర యూనిట్‌కు సహకరించాలని కోరారు.

కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులు తమ స్వంత రిస్క్‌తోనే ఇటువంటి పనులు చేయాలని, చట్టపరమైన పరిణామాలకు వారే బాధ్యులని స్పష్టం చేశారు.

లీకైన కంటెంట్‌ను చూడవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని నిర్మాతలు ప్రేక్షకులను కోరారు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా కంటెంట్ సర్క్యులేట్ చేయడం నేరమని వారు గుర్తుచేశారు.

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సెన్సార్ వివాదాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.తాజాగా మూవీ ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో జన నాయగన్ టీంకు మరో పెద్ద దెబ్బ తగిలింది. విడుదలకు ముందే ఈ విధంగా ఆన్‌లైన్‌లో కంటెంట్ ప్రత్యక్షం కావడం అభిమానులను మరియు చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.