రికార్డు సృష్టించిన ఆయా షేర్ సాంగ్

Aaya Sher from The Paradise Gets Record-Breaking Response

నేచరుల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గ్లింప్స్, పోస్టర్లు, సింగిల్ సింగిల్ ‘ఆయా షేర్’కు వస్తున్న భారీ స్పందనతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ముఖ్యంగా, ఆయా షేర్ పాట భారీ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సినిమాపై మ్యాసీవ్ హైప్ ని క్రియేట్ చేసింది,

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన హై-వోల్టేజ్ మ్యూజిక్ మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘ఆయా షేర్’ విడుదలైన రోజు నుండి యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాట 101 మిలియన్+ వ్యూస్ సాధించి, నాని పాటలలోనే వేగంగా ఈ ఫీట్ సాధించిన పాటగా నిలిచింది. సినిమా రిలీజ్‌కు ముందే 100 మిలియన్ మార్క్ దాటిన నాని తొలి పాటగా “ఆయా షేర్” రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ పాటను వైరల్ జోన్‌లోకి తీసుకెళ్లిన ప్రధాన కారణం నాని స్క్రీన్‌పై చూపించిన మాగ్నెటిక్ ఎనర్జీ. ఆయన డైనమిక్ మూవ్స్, ఫియర్స్ అటిట్యూడ్, అలాగే ఆకట్టుకునే హుక్ స్టెప్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇన్స్టా లో రీల్స్ వరదలా వచ్చాయి, యూట్యూబ్‌లో డ్యాన్స్ కవర్లు హోరెత్తించాయి, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆ స్టెప్స్‌ను రీక్రియేట్ చేశారు.

పాట ఎంత గ్రాండ్‌గా వినిపిస్తుందో, అంతే గ్రాండ్‌గా కనిపించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షూట్ కోసం ప్రత్యేకంగా భారీ స్లమ్ సెట్ నిర్మించారు. ఆ విజువల్స్‌కు రా, లార్జర్-దెన్-లైఫ్ ఫీల్ ఇవ్వడంతో పాటకు సరిపోయే ఇంటెన్సిటీ వచ్చింది.

“ఆయా షేర్” ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతూ, గ్లోబల్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా మారడంతో “ది ప్యారడైస్” పై హైప్ అమాంతం పెరిగింది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని SLV Cinemas బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుండగా, అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.